Happy Passia: 14 పేలుళ్ల సూత్రధారి పట్టివేత.. అమెరికాలో హర్‌ప్రీత్ అరెస్టు
Happy Passia: పంజాబ్‌లో 14 పేలుళ్ల సంఘటనలకు సూత్రధారి అయిన హ్యాపీ పాసియా అలియాస్ హర్‌ప్రీత్ సింగ్‌ను అమెరికాలో అరెస్టు చేశారు. అమెరికా నుంచే అతను పంజాబ్‌లో పేలుళ్ల ఆపరేషన్ నిర్వహించాడు.
చండీఘడ్: పంజాబ్ పోలీసుల్ని వణికించిన ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపి పాసియా(Happy Passia)ను అమెరికాలో అరెస్టు చేశారు. హర్‌ప్రీత్ అరెస్టుకు చెందిన ఫోటోలను రిలీజ్ చేశారు. అతన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టడీకి తీసుకెళ్లారు. అక్రమ రీతిలో అమెరికాలో ప్రవేశించిన హరిప్రీత్ .. బర్నర్ ఫోన్ల ద్వారా అరెస్టు నుంచి ఇన్నాళ్లూ తప్పించుకున్నాడు.
ఇండియాలో అతను మోస్ట్ వాంటెడ్. అతని తలపై 5 లక్షల నజరానా కూడా ఉన్నది. పంజాబ్‌లో ఇటీవల జరిగిన హింసకు ఇతనే ప్రధాన కారకుడు. గడిచిన ఆరు నెలల్లో 14 ఉగ్రదాడులు జరడానికి కారణంగా హరిప్రీత్ అని పోలీసులు పేర్కొన్నారు. 2024 నవంబర్ నుంచి అమృత్‌సర్‌లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల వెనుక ఇతన హస్తం ఉన్నట్లు తేలింది. పేలుళ్లకు తానే కారణమని అతను సోషల్ మీడియాలో ప్రచాచం చేశాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, బబ్బార్ కల్సా ఇంటర్నేషనల్‌తో జత కలిసి హరిప్రీత్ సింగ్ పంజాబ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు భద్రతా దళాలు ఆరోపించాయి. తాజాగా ఓ యూట్యూబర్ ఇంటితో పాటు బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపై కూడా అతను దాడి చేయించాడు. ఈ రెండు ఘటనలు జలంధర్‌లోనే జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

