Gyanvapi case | జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు అనుమతించిన కోర్టు
Gyanvapi case | జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది.
న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న కోర్టు.. శుక్రవారం సర్వేకు అనుమతిస్తూ కీలక తీర్పు చెప్పింది.
అయితే, ఆ జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్టుగా హిందు ప్రతినిధులు చెబుతున్న ‘వాజూ ఖానా’ మినహా అంతటా సర్వే చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది. జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ ఆలయం ఉందా.. లేదా..? అనే విషయాన్ని కనిపెట్టా ఆర్కియాలజీ సర్వే అధికారులను కోర్టు ఆదేశించింది.
ఈ సర్వే పూర్తిచేసి ఆగస్టు 4వ తేదీకల్లా నివేదికను సమర్పించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది. కాగా, ఈ కేసు విచారణ మరోసారి ఉన్నత న్యాయస్థానాల దాకా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహణకు అనుమతించాలంటూ హిందువుల తరఫున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై వారణాసి జిల్లా కోర్టు జూలై 14న వాదనలు విన్నది. ఆ తర్వాత అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు ఇవాళ తీర్పు చెప్పింది. వారణాసి కోర్టు తీర్పు విషయాన్ని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వెల్లడించారు. ఈ తీర్పు కేసులో టర్నింగ్ పాయింట్ అవుతుందని హిందువుల తరపున వాదించిన అడ్వకేట్ సుభాష్ నందన్ చతుర్వేది వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

