Gyanvapi Case | జ్ఞానవాసి కేసులో కీలక మలుపు.. మసీదు ప్రాంగణంలో పూజలకు కోర్టు అనుమతి..!
Gyanvapi Case | జ్ఞానవాపి కేసులో కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది.
Gyanvapi Case | జ్ఞానవాపి కేసులో కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది. జ్ఞానవాపి వ్యాసాజీ బేస్మెంట్లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్ జిల్లా డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఇరువర్గాలు వాదనలు విన్నది. కోర్టు బుధవారం కీలక తీర్పును వెల్లడించింది. బేస్మెంట్లో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది.
శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్‌ను తెరిచేందుకు అనుమతించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు 1993కి ముందు తరహాలోనే బేస్మెంట్లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున ముంతాజ్ అహ్మద్, ఇఖ్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
బేస్మెంట్ మసీదులో భాగమని స్పష్టం చేశారు. అక్కడ పూజలు చేయడానికి వీలు లేదన్నారు. బేస్మెంట్ మసీదులో భాగమని, అది వక్ఫ్‌బోర్డు ఆస్తి అని పేర్కొన్నారు. అక్కడ పూజలు చేయకూడదని వాదించారు. అయితూ, ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హిందూపక్షం న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు అన్నారు. పూజలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

