ఏఐతో ఫేక్ ఐడీలు.. రూ.కోటికిపైగా రుణాలు
ఏఐ సాయంతో తప్పుడు గుర్తింపు పత్రాలు తయారు చేసి రూ.కోటికి పైగా రుణాలు తీసుకున్న సోదరుల్ని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. గౌరవ్ చబ్రా(35), దివ్యాంగ్ చబ్రా(24) కలిసి 2002 నుంచి తమ పేర్లతో ఉన్న వారి వివరాలు ఆన్ లైన్ లో శోధించి తప్పుడు గుర్తింపు పత్రాలు తయారు చేసి అప్పులు తీసుకుంటున్నారు. పదో తరగతితో చదువు ఆపేసిన వీళ్లిద్దరు.. పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు తయారు చేసి ఆన్లైన్ లోన్ కంపెనీల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో అప్పు తీసుకుంటే అనుమానం వస్తుందని కేవలం రూ.లక్ష మాత్రమే తీసుకునేవారు.
- గురుగ్రామ్ సోదరుల ఘరానా మోసం
- టెన్త్ వరకే చదువుకున్న నిందితులు
గురుగ్రామ్: ఏఐ సాయంతో తప్పుడు గుర్తింపు పత్రాలు తయారు చేసి రూ.కోటికి పైగా రుణాలు తీసుకున్న సోదరుల్ని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. గౌరవ్ చబ్రా(35), దివ్యాంగ్ చబ్రా(24) కలిసి 2002 నుంచి తమ పేర్లతో ఉన్న వారి వివరాలు ఆన్ లైన్ లో శోధించి తప్పుడు గుర్తింపు పత్రాలు తయారు చేసి అప్పులు తీసుకుంటున్నారు. పదో తరగతితో చదువు ఆపేసిన వీళ్లిద్దరు.. పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు తయారు చేసి ఆన్లైన్ లోన్ కంపెనీల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో అప్పు తీసుకుంటే అనుమానం వస్తుందని కేవలం రూ.లక్ష మాత్రమే తీసుకునేవారు.
ఇలా నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదించే వారని పోలీసులు చెప్పారు. దిల్లీలోని ప్రతాప్ గంజ్ కు చెందిన ఓ వ్యక్తి.. తన పాన్ నంబర్ పై తాను తీసుకోని అప్పులు ఉన్నాయని గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సోదరుల బాగోతం బయటపడింది. సుమారు 30 లోన్లు ఫిర్యాదుదారుడి పేరు మీద నిందితులు తీసుకున్నారని.. మొత్తం రూ.7 లక్షలు విడతల వారీగా డ్రా చేశారని పోలీసులు వివరించారు.
అంతేకాక.. మరో 47 లక్షల రూపాయలకు గ్యారెంటీ ఇచ్చారన్నారు. బాధితుల పాన్, ఓటర్ ఐడీల్లో ఏఐ సాయంతో వేరే ఫొటోలు, తండ్రి పేరు, చిరునామా మార్చి అప్పులు, మొబైల్ సిమ్ కార్డులు తీసుకున్నారు. కేవలం గౌరవ్ అనే పేరుతో ఉన్న 50 మంది తప్పుడు గుర్తింపు పత్రాలను తయారు చేసి హర్యానా, నోయిడాలో లోన్లు తీసుకున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి చిరునామాలు మార్చే వాళ్లు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

