డ్రగ్స్ అడ్డాగా గుజరాత్
బీజేపీ పాలిత గుజరాత్లో మద్యం, వ్యభిచారం, డ్రగ్స్ అమ్మకాలు, జూద కార్యక్రమాలు ఎక్కడబడితే అక్కడ యథేచ్ఛగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఘ్ణేశ్ మెవానీ శనివారం ఆరోపించారు.
- విచ్చలవిడిగా మద్యం, వ్యభిచారం
- దీనిపై అసెంబ్లీలో చర్చించాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్
అహ్మదాబాద్, నవంబర్ 29: బీజేపీ పాలిత గుజరాత్లో మద్యం, వ్యభిచారం, డ్రగ్స్ అమ్మకాలు, జూద కార్యక్రమాలు ఎక్కడబడితే అక్కడ యథేచ్ఛగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఘ్ణేశ్ మెవానీ శనివారం ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని, నార్కోటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను రాష్ట్రంలోనే వివిధ కంపెనీలలో తయారు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై చర్చించడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్, వ్యభిచార, జూద కేంద్రాలు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 250 తాలుకాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
‘ఇటీవల రూ.64 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ కోస్తా తీరంలో పట్టుకున్నారు. వాటిని సరఫరా చేసేది ఎవరు? వాటిని అందుకునేదెవరు? దీనిపై పోలీసులు, అధికారులు ఏమని చెబుతారు’ అని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలన్నీ పోలీసులు, ప్రభుత్వ ఆశీస్సులు లేకుండా కొనసాగుతున్నాయా? అని ఆయన నిలదీసాశారు. అందుకే రాష్ర్టానికి పెను సమస్యగా మారిన నార్కోటిక్ డ్రగ్స్‌పై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, ఇటీవల సీజ్ చేసిన డ్రగ్స్‌కు సంబంధించిన వాస్తవ వివరాలను సభకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నిషేధం అమలులో ఉన్న గుజరాత్లో ప్రతి గల్లీలోనూ మద్యాన్ని విచ్చలవిడిగా బహిరంగంగా అమ్మడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

