Morbi bridge collapse: మోర్బీ బ్రిడ్జ్ బాధితులకు 10 లక్షల నష్టపరిహారం: గుజరాత్ హైకోర్టు ఆదేశం
Morbi bridge collapse:మోర్బీ బ్రిడ్జ్ బాధితులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. బ్రిడ్జ్ కూలిన ఘటనలో 135 మంది మరణించిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్: గుజరాత్లో గత ఏడాది మోర్బీ బ్రిడ్జ్ (Morbi Bridge)కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చెల్లించాలని ఒరేవా గ్రూపు(Oreva Group)నకు ఇవాళ గుజరాత్ హైకోర్టు (Gujarat High Court)ఆదేశాలు జారీ చేసింది. ఆ ఘటనలో గాయపడ్డవారికి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. ఒరేవాగ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ సంస్థ ఆ బ్రిడ్జ్‌ను మెయిన్టేన్ చేస్తున్నది.
బ్రిటీష్ కాలంలో మచ్చూ నదిపై నిర్మించిన ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన కూలిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సోనియా గోకాని, జస్టిస్ సందీప్ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్రిడ్జ్ మెయింటేనెన్స్లో లోపాలు ఉన్నాయని, సరైన సమయంలో రిపేర్లు చేయలేదని ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిట్ తన రిపోర్టులో పేర్కొన్నది.
మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనలో సుమారు 135 మంది మరణించారు. ఒరేవా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ జయ్‌సుఖ్ పటేల్‌ను జనవరి 31వ తేదీన అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కోర్టు ముందు ఆయన సరెండర్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

