Dwaraka | పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ఇకపై అరేబియాలో మునిగిన ద్వారక నగరాన్ని దర్శించొచ్చు.. ఎలాగంటే?
మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్‌మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
- వచ్చే ఏడాది శ్రీకృష్ణజన్మాష్టమి లేదా దీపావళి రోజున ప్రారంభం
Dwaraka | అహ్మదాబాద్, డిసెంబర్ 27: మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్‌మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది క్రిష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్‌మెరైన్ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది. పర్యాటకులను సబ్మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే మొదటిసారిగా ప్రభుత్వం పేర్కొన్నది.
అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్‌మెరైన్ నుంచి భక్తులు తిలకించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహించనున్నామని పేర్కొన్నది. దీనికి సంబంధించి ‘మజ్గావ్ డాక్’ షిప్‌యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ‘రెండు గంటలపాటు సబ్‌మెరైన్ యాత్ర ఉంటుంది. 300 అడుగుల లోతుకు వెళ్లి.. ఆనాటి ద్వారకను కనులారా చూసి రావొచ్చు. ఒక ట్రిప్‌లో 24 మంది పర్యాటకులకు తీసుకెళ్తాం. అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారు’ అని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

