గుజరాత్లో ఓడినా.. జాతీయ హోదా దక్కించుకున్న ఆప్
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హతను సాధించింది. దీంతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం సంతోషంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హత సాధించిందన్నారు. పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవతరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గోవాలో రెండు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. ఇవాళ వెల్లడైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఐదు స్థానాలను గెలుచుకుంది. మొత్తం ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఆప్ జాతీయ పార్టీకి హోదా సంపాదించింది.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్సభ స్థానాలు గెలువాలి.
2. ఏవైనా నాలుగు రాష్ర్టాల నుంచి 11 లోక్సభ సీట్లు (రెండు శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ర్టాల నుంచి ఎన్నికవ్వాలి.
3. కనీసం నాలుగు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.
Today, the AAP has become a national party. Results of #GujaratElections have come and the party has become a national party. 10 yrs ago AAP was a small party, now after 10 yrs it has govts in 2 states & has become a national party:AAP national convenor & Delhi CM Arvind Kejriwal pic.twitter.com/dgDshy8GnO
— ANI (@ANI) December 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

