గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మొత్తం ఓటర్ల సంఖ్య 4.90 కోట్లు
Gujarat assembly elections:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనరల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్నట్లు సీఈసీ వెల్లడించారు. 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 17506, రూరల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 182 మోడల్ పోలింగ్ స్టే
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనరల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్నట్లు సీఈసీ వెల్లడించారు. 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 17506, రూరల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 182 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,90,89765. దీంట్లో తొలిసారి 4,61,494 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకున్నది. ఈ సారి కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య రసవత్తర పోరు తప్పదు. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18, 2023లో ముగియనున్నది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ప్రత్యేక అబ్జర్వర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మహిళలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. 4.90 కోట్ల మంది ఓటర్లలో పురుషులు 2.53 కోట్లు, మహిళలు 2.37 కోట్లు, మూడవ జెండర్‌కు చెందిన 1,417 మంది ఓటర్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

