లక్నో : ఢిల్లీ మెట్రోలో కన్వరియాల డ్యాన్స్ వీడియో (Viral Video) నెట్టింట వైరలవుతోంది. 13 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో మెట్రో కంపార్ట్మెంట్లో కన్వరియాల బృందం మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ హోరెత్తించింది. వారు డ్యాన్స్ చేస్తుండగా కొందరు కెమెరాల్లో రికార్డు చేయడం కనిపించింది.
పంకజ్ ఉపాధ్యాయ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగానే ఆన్లైన్లో హాట్ డిబేట్ సాగింది. పెద్దసంఖ్యలో ఈ వైరల్ క్లిప్‌పై నెటిజన్లు తలోరీతిన కామెంట్ చేశారు.
Now it’s Kanwariya’s dance in Delhi Metro 😃#KanwarYatra2023 #KanwarYatra #DelhiMetro #ViralVideo #BumBumBhole #Sawan pic.twitter.com/sePONwwGE6
— Pankaj Upadhyay (@pankaju17) July 5, 2023
శివ భక్తులైన కన్వరియాలు శ్రావణ మాసంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌ను సందర్శించి పవిత్ర గంగానదిలో స్నానాలు చేస్తారు. ఈ ఏడాది కన్వర్ యాత్ర జులై 4న ప్రారంభమైంది.
Read More :