Viral video | ముద్దు విషయంలో వధూవరుల చిలిపి తగాదా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral video | వివాహ వేడుకల్లో చోటుచేసుకునే ఫన్నీ సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే మరో ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ముద్దు విషయంలో వధూవరుల మధ్య పెళ్లి వేదికపై చోటుచేసుకున్న ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.
Viral video : వివాహ వేడుకల్లో చోటుచేసుకునే ఫన్నీ సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే మరో ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ముద్దు విషయంలో వధూవరుల మధ్య పెళ్లి వేదికపై చోటుచేసుకున్న ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.
ఇంతకూ ఆ వీడియోలో ఏమున్నదంటే.. వేదికపై వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. అనంతరం వరుడి వంతు వచ్చింది. అతను దండ చేతిలో పట్టుకుని వధువు చెవిలో గుసగుస చెప్పాడు. అందుకు వధవు వద్దని అడ్డంగా తల ఊపింది. అయినా తర్వాత వరుడు చేసిన చిలిపి పనిని బట్టి అతడు ముద్దు అడిగాడని అర్థమవుతున్నది.
ఎందుకంటే వధవు వద్దువద్దని వారిస్తూ వెనక్కి వెళ్తున్నా వరుడు పట్టుబట్టి ఆమె చెక్కిలిపై ముద్దు పెట్టేశాడు. అనంతరం ఆమె మెడలో పూలమాల వేశాడు. ఈ చిలిపి వీడియోను @ChapraZila అనే ఎక్స్ (X) హ్యాండిల్లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి మాత్రమే కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా 83 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. వరుడు అతి చేశాడని ఒకరు, వధువు వద్దన్నప్పుడు ఊర్కోవచ్చుగా అని మరొకరు, ఇది మన సంస్కృతి కాదని ఇంకొకరు ఇలా రకరకాల కామెంట్లు చేశారు. మరెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేసి తోచిన కామెంట్ చేసెయ్యొచ్చు..
जबतक दूल्हे का डिमांड पूरा नही हुआ तबतक दूल्हे ने दुल्हन को वरमाला नही पहनाया 😂😅 pic.twitter.com/tfJVk447zA
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) December 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

