సోనియాతో భేటీ కానున్న ఆ ఇద్దరు నేతలు.. జాతీయస్థాయిలో మహాకూటమికి కసరత్తు..!
Grand Alliance: జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు భారీ కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ ఊపందుకున్నది.
న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు భారీ కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ ఊపందుకున్నది. బీహార్‌లో మహా కూటమికి చెందిన ఇద్దరు అగ్ర నేతలైన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కాబోతున్నారన్న వార్త ఈ చర్చకు బలం చేకూరుస్తున్నది.
నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ సోనియాగాంధీతో సమావేశం కానుండటం దాదాపు గత ఏడేండ్లలో ఇదే తొలిసారి. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా హాజరవుతారని లాలూ, నితీశ్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాహుల్‌గాంధీ ప్రస్తుతం.. కన్యాకుమారి టు కశ్మీర్ భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నారు.
ఇదిలావుంటే లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే సోనియాతో భేటీ కాబోతున్నారని, ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని, అందులో జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం కూడా ఉంటుండవచ్చునని మరో వాదన వినపడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

