Commercial Gas : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. మన దేశంలో కూడా కమర్షియల్ గ్యాస్ (Commercial Gas) సిలిండర్ సరఫరాపై పడింది. తాజాగా కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా కమర్షియల్ ఎల్పీజీ (Commercial LPG) సరఫరాను 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ (Niraj Mittal) లేఖ రాశారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కోటాను కేంద్రం ఇటీవల తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో క్రమంగా వాటిని పెంచుతూ వస్తోంది. గతవారం 50 శాతంగా ఉన్న ఈ వాణిజ్య సిలిండర్ల సరఫరాను.. తాజాగా మరో 20 శాతం పెంచింది. అయితే వీటిల్లో ఉక్కు, ఆటోమొబైల్స్, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి కీలక పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇక ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40 శాతంగా ఉన్న కేటాయింపులను మరో 10 శాతం పెంచింది.