న్యూఢిల్లీ: మహదేవ్ సహా 22 బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను నిషేధించే అధికారం ఉన్నప్పటికీ వాటిని నిషేధించాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడూ తమకు విజ్ఞప్తి చేయలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. దీంతో మహదేవ్‌తో పాటు రెడ్డిఅన్నప్రెస్టొప్రో లాంటి 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై తమ మంత్రిత్వ శాఖ నిషేధం విధించిందన్నారు.