Meftal Side Effects | ఆ పెయిన్ కిల్లర్ వాడకం పట్ల అలర్ట్ ఉండాలన్న కేంద్రం..
Meftal Side Effects | కండరాల నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పి తదితర నొప్పుల నివారణకు మెఫ్తాల్ అనే ఔషధం వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, రోగులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
Meftal Side Effects | తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి.. ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి ఉంటుంది. దీని నివారణకు టాబ్లెట్లు వేస్తుంటారు.. వైద్య నిపుణులు రాసే ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు మింగుతుంటారు. కానీ కొన్ని రకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని వైద్యులు, రోగులకు కేంద్ర ప్రభుత్వ ఫార్మా స్టాండర్డ్ బాడీ ‘ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) అలర్ట్ జారీ చేసింది. ‘మెఫ్తాల్’ పేరుతో సర్వ సాధారణంగా వాడే మెఫెనామిక్ యాసిడ్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ వాడటం వల్ల ఇసినోఫిలియా వంటి డ్రెస్ సిండ్రోమ్ సమస్యలు తలెత్తుతాయి.
ఈ టాబ్లెట్‌ను ఎక్కువగా మహిళలు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నివారణకు, తల నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు, పిల్లల్లో వచ్చే హై ఫీవర్ వంటి సమస్యలకు వాడుతుంటారు. డ్రెస్ సిండ్రోమ్ అంటే డ్రగ్ రాష్ విత్ ఇసినోఫిలియా అండ్ సిస్టమ్యాటిక్ సింప్టమ్స్.. అంటే తీవ్రమైన అలర్జీ సమస్య తలెత్తుతుంది. వివిధ అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది వివిధ ఔషధాలపై ప్రతికూల పరిస్థితులపై పర్యవేక్షణతోపాటు సమాచారం సేకరించే సంస్థే ‘ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ). కనుక ఈ ఔషధం వినియోగం, సిఫారసు విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలని వైద్యులకు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

