వరి క్వింటాల్‌కు రూ.72 మద్దతు ధర పెంపు.. మొత్తంగా రూ.1,940

ఢిల్లీ : 2021-22 పంట సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరని క్వింటాల్‌కు రూ .72 పెంచింది. పెంచిన ధరతో ఇకపై క్వింటాల్‌కు రూ .1,940 దక్కనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ కాలానికి సాధారణ వర్షపాతమే ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. పంటల కనీస మద్దతు ధరలపై తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు పెంచినట్లు భవిష్యత్తులో కూడా ఇది కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. కనీస మద్దతు ధరలపై ఉన్న రైతుల భయాలను తొలగించినట్లు చెప్పారు.
గతేడాది వరి క్వింటాల్‌కు రూ.1,868 ఉండే. కాగా 2021-22 పంట కాలానికి వరికి కనీస మద్దతు ధరను మరో రూ.72 పెంచి రూ.1,940 చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సజ్జలు క్వింటాల్‌కు గతేడాది రూ.2,150 ఉండగా ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,250 అందనున్నట్లు తెలిపారు. పంటలకు క్రమం తప్పకుండా మద్దతు ధరలు పెరుగుతూనే ఉంటాయని వారి ఫలితాలు రైతులకు అందనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

