రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీఎం కిసాన్ (ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకొని.. రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులో ఉన్నాయన్నారు. గత రెండేళ్ల కిందట సీఎం కిసాన్ పథకం గౌరవ ప్రదమైన జీవితాన్ని, అలాగే కష్టపడి పని చేసే రైతులకు శ్రేయస్సును అందించే లక్ష్యంతో ప్రారంభించినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

