జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. అవసరం మేరకు ఆక్సిజన్ సరఫరా లేక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. దీని కోసం ఎమర్జెన్సీ నిధుల వినియోగానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు రోజుల కిందట అనుమతి ఇచ్చారు. దీంతో ఎక్కడికైనా తరలించే మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు సైనిక రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నారు.
సంబంధిత ప్రక్రియలు పూర్తయితే వారం రోజుల్లో ఇవి దేశానికి చేరుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏఎఫ్ఎంసీ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచుతారని చెప్పారు. ప్రతి ప్లాంట్ నిమిషానికి 40 లీటర్లు, గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అవసరం మేరకు వీటిని ఎక్కడికైనా తరలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

