Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
Teacher Rapes Girl | ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు నలుగురు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ఆ టీచర్ను అరెస్ట్ చేశారు.
గాంధీనగర్: ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు నలుగురు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ఆ టీచర్ను అరెస్ట్ చేశారు. (Teacher Rapes Girl) గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ‘మిషన్ స్మైల్’లో భాగంగా జాఫరాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా పోలీసులు ఆ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై బాలికలకు అవగాహన కల్పించారు.
కాగా, ఒక ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాలికలు ధైర్యంగా ముందుకు వచ్చారు. అత్యాచారానికి గురైన బాధిత బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఆ ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు.
మరోవైపు నిందితుడైన ఆ టీచర్, టీ తయారు చేయాలనే నెపంతో నలుగురు విద్యార్థినులను స్టాఫ్ రూమ్లోకి పిలిచి వారిని లైంగికంగా వేధించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. వారిలో ఒక బాలికపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారిణి తెలిపారు. ఆ నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Girl
- Government
- Gujarat
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

