Google | న్యూఢిల్లీ: జీమెయిల్లో స్పామ్‌ను గుర్తించే విధంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత రక్షణ వ్యవస్థను గూగుల్ అభివృద్ధి చేసింది. ప్రత్యేకమైన అక్షరాలు, ఎమోజీలు, టైపోస్, ఇతర అక్షరాలతో, టెక్స్ రూపంలోని రకరకాల ఈమెయిల్స్‌ను, స్పామ్‌ను ఇప్పుడున్న రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు.
ఈ నేపథ్యంలో దీనిని అప్‌గ్రేడ్ చేస్తూ ‘ఆర్ఈటీవీఈసీ’ అనే ఏఐ ఆధారిత మోడల్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. స్పామ్ మెయిల్స్‌ను వర్గీకరించే విధంగా ‘ఆర్ఈటీవీఈసీ’ రక్షణ వ్యవస్థను తీసుకొస్తున్నది. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ ప్లేలలో హానికరమైన కంటెంట్, ఫిషింగ్ దాడులు, అనుచిత వ్యాఖ్యలు.. మొదలైన వాటిని గుర్తించేందుకు ‘ఆర్ఈటీవీఈసీ’ మరింత సమర్థంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.