Buxar | బక్సర్‌లో పట్టాలు తప్పిన మరో రైలు.. వారంలోపే రెండో ప్రమాదం
బీహార్‌లోని బక్సర్‌లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది.
బక్సర్: బీహార్‌లోని బక్సర్‌లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది. గూడ్సు రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళ్తుండగా బక్సర్‌లోని డమరౌన్ స్టేషన్ (Dumraon station) వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన కోచ్‌ను అక్కడి నుంచి తరలించి, రైల్వే లైన్‌ను సరిచేయడానికి సిబ్బంది కష్టపడుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలను గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ నెల 11న బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి . ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

