Goods train catches fire | గూడ్స్ రైలులో మంటలు.. ఒడిశాలోని బాలాసోర్‌లో సంఘటన
Goods train catches fire | ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్‌కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా రైల్వే స్టేషన్ వద్ద ఆగింది.
భువనేశ్వర్: ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్‌కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా రైల్వే స్టేషన్ వద్ద ఆగింది. ఈ సందర్భంగా ఒక గూడ్స్ వ్యాగన్ నుంచి పొగలు, మంటలు రావడాన్ని రైల్వే స్టేషన్ సిబ్బంది గమనించారు. అవి ఇతర వ్యాగన్లకు వ్యాపించకుండా ఉండేందుకు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
కాగా, అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది ఆ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత అంతా బాగానే ఉందని నిర్ధారించిన రైల్వే అధికారులు ఆ గూడ్స్ రైలు అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతించారు. అయితే బొగ్గు రవాణా చేస్తున్న ఆ గూడ్స్ రైలుకు మంటలు ఎలా వ్యాపించాయన్నది తెలియలేదు. గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరుగడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలులో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వేగంగా స్పందించారు.
#WATCH | Odisha: Fire broke out in a compartment of goods train at Rupsa railway station in Balasore district. Cause of the fire is yet to be known. The fire was brought under control by the fire brigade pic.twitter.com/36lss3vbCn
— ANI (@ANI) June 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Balasore
- fire
- Goods Train
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

