Goldy Brar | గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన హోంశాఖ..!
Goldy Brar | గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఉగ్రవాది ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. గోల్డీ బ్రార్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు.
Goldy Brar | గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఉగ్రవాది ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. గోల్డీ బ్రార్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ కెనడాకు మకాం మార్చాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ సహా దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.
సెప్టెంబర్ నెలలో గోల్డీ బ్రార్ పోలీసులపై సైతం దాడికి పాల్పడ్డాడు. ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లఖ్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో జరిగిన ఆర్పీజీ దాడికి లాండా ప్రధాన సూత్రధారి. గతంలో లాండాపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డును ప్రకటించింది. లఖ్బీర్ స్వస్థలం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా హరికే గ్రామం. ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. అతను 2017లో కెనడాకు పారిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

