Ballot Paper | మళ్లీ పేపర్ బ్యాలెట్‌కు మళ్లాలి.. ఈవీఎంలను రద్దు చేయాలి
ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలను తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని పలు పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
- హ్యాకింగ్ ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 18: ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలను తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని పలు పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఎక్స్ వేదికగా ఈవీఎంలకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తేనే ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తి నిలబడుతుందని అన్నారు.
కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి అధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడంలో ఈవీఎంల పాత్ర ఉన్నదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగతాయనే దానిపై ఈసీ ప్రజలకు హామీ ఇవ్వాలని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

