Girl’s charred body | బొగ్గు కొలిమిలో కాలిన స్థితిలో బాలిక మృతదేహం.. సామూహిక లైంగికదాడి జరిగినట్లు అనుమానం
Girl's charred body | ఒక బొగ్గు కొలిమిలో కాలిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని (Girl's charred body) గుర్తించారు. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
జైపూర్: ఒక బొగ్గు కొలిమిలో కాలిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని (Girl’s charred body) గుర్తించారు. ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం ఒక మహిళ, 14 ఏండ్ల కుమార్తె కలిసి పశువులను మేపేందుకు పొలాలకు వెళ్లారు. ఆ మహిళ పశువులు ఇంటికి తిరిగి రాగా, ఆ బాలిక మాత్రం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక కోసం వెతికారు. బొగ్గు కొలిమి ఉన్న చోట ఆమె కాలి పట్టాలు, చెప్పులు కనిపించాయి. అలాగే బొగ్గు కొలిమిలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు ఆ బొగ్గు కొలిమి వద్దకు చేరుకున్నారు. అందులో ఉన్న కాలిన మృతదేహం అవశేషాలను పరిశీలించారు. ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి నమూనాలు సేకరించారు. డీఎన్ఏ పరీక్షకు వాటిని పంపుతామని పోలీసులు తెలిపారు. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఆమెను హత్య చేసి మృతదేహాన్ని బొగ్గు కొలిమిలో కాల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

