Girl Suicide: వేధించిన యువకులు.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి విద్యార్థిని మృతి
Girl Suicide: 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని .. ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
చండీఘడ్: హర్యానాలో 12వ తరగతి చదువుతున్న అమ్మాయి బలవన్మరణానికి(Girl Suicide) పాల్పడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన బుధవారం గన్నౌర్లో చోటుచేసుకున్నది. తమ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లైంగికంగా వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి తండ్రి తెలిపాడు. ఖాన్పూర్ కలాన్‌లో ఉన్న భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజీకి ఆ అమ్మాయి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం జీఆర్పీ పోలీసులు తరలించారు.
ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఆ ముగ్గుర్నీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకర్ని అరెస్టు చేశారు. ఇవాళ తుషార్ అనే వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. గన్నౌరు నుంచి బోద్వాల్ మజ్రీ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ముందు దూకి విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్‌హెచ్‌వో జోగిందర్ సింగ్ తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు గుర్తించారు. తుషార్, కమల్, మంజీత్ అనే ముగ్గురు యువకులు తన కూతుర్ని లైంగికంగా వేధించినట్లు తండ్రి పేర్కొన్నారు.
వేధింపులు తట్టుకోలేక తన కూతురు సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి తన ఫిర్యాదులో తెలిపాడు. ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం కేసును నమోదు చేశారు. ఆధార్ కార్డు ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లు ఉందని, అంటే ఈ కేసులో పోక్సో చట్టం వర్తించకపోవచ్చు అని గన్నౌరు జీఆర్పీ సురేశ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

