Girl Sold By Aunt | బాలికను అమ్మేసిన బంధువు.. రెండు నెలల బిడ్డతో పారిపోయి పోలీసులకు ఫిర్యాదు
Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం గురించి చెప్పింది.
జైపూర్: బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. (Girl Sold By Aunt) కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం గురించి చెప్పింది. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మురళీపురాకు చెందిన 11 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు గొడవ పడ్డారు. దీంతో ఆ బాలికను నీమ్రానాలోని మేనత్త వద్దకు పంపారు.
కాగా, బాగోగులు చూసుకోవాల్సిన మహిళ ఆ బాలికను అమ్మేసింది. హర్యానాలోని చర్కి దాద్రీ జిల్లా బధ్వానా గ్రామానికి చెందిన సందీప్ యాదవ్, సత్వీర్ యాదవ్‌కు రెండు లక్షలకు విక్రయించింది. మూడేళ్లుగా వారి ఇంట్లో ఉన్న ఆ బాలిక బలవంతంగా రెండుసార్లు గర్భం దాల్చింది. 12 ఏళ్ల వయసులో ఒక బిడ్డకు, 14 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల హర్యానాలోని ఆ ఇంటి నుంచి ఆ బాలిక తప్పించుకుంది. మొదటి బిడ్డను అక్కడే వదిలేసిన ఆమె రెండు నెలల పసి బిడ్డతో రాజస్థాన్ చేరుకుంది. మురళీపురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పింది.
మరోవైపు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. హర్యానాలోని అంబాలాలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సందీప్‌ను అరెస్టు చేశారు. అతడి తండ్రి సత్వీర్ను అతడి ఇంటి వద్ద మరో పోలీస్ బృందం అరెస్టు చేసింది. అలాగే బాలికను విక్రయించిన బంధువైన మహిళను రాజస్థాన్‌లోని బెహ్రోర్‌లో శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

