న్యూఢిల్లీ : ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ.. మెట్రో స్టేషన్లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అంతేకాదు.. అక్కడ్నుంచి జారిపడితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ఈ ఘటనను గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ అప్రమత్తమై.. ఆ బాలిక ప్రాణాలను రక్షించాడు.
ఈ ఘటన ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ బాలికను ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఆ చిన్నారి నివాసం ఈ మెట్రో స్టేషన్కు సమీపంలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
A CISF staff rescues a child stuck in a grill at a metro station 👏🏻👏🏻 great work 👏🏻👏🏻 #Delhi pic.twitter.com/kfGID8qFCi
— AK (@compatriot__) February 28, 2022