Girl Raped In Moving Car | కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్
Girl Raped In Moving Car | ఒక బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఆ బాలికను బ్లాక్మెయిల్ చేయసాగారు. వారి మాట వినకపోడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భోపాల్: ఒక బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Girl Raped In Moving Car) మరో వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఆ బాలికను బ్లాక్మెయిల్ చేయసాగారు. వారి మాట వినకపోడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఏడాది కిందట చినూర్‌కు చెందిన ఒక యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతడు తన ఇద్దరు స్నేహితులను ఆమెకు పరిచయం చేశాడు. దీంతో వారు సోషల్ మీడియాలో చాట్ చేసుకున్నారు.
కాగా, జూన్ 1న బాలిక స్నేహితుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వచ్చారు. ఆమెను పిలిపించి కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా వెనుక సీటులో ఉన్న బాలికపై ఆమె ఫ్రెండ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ పక్క సీటులో కూర్చొన్న మరో వ్యక్తి మొబైల్లో దీనిని రికార్డ్ చేశాడు. అనంతరం నిందితుడు వీడియో చూపించి ఆ బాలికను బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఆమె మాట వినకపోవడంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
మరోవైపు ఇది తెలుసుకున్న బాధిత బాలిక జరిగిన సంఘటనను తన కుటుంబానికి చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితులంతా 18 నుంచి 20 ఏళ్ల యువకులని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

