Girl Attacked By Stray Dogs | బాలికపై వీధి కుక్కల దాడి.. కాపాడిన ఒక వ్యక్తి
Girl Attacked By Stray Dogs | ఒక బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Girl Attacked By Stray Dogs) ఆ చిన్నారిని రోడ్డుపై ఈడ్చాయి. గమనించిన ఒక వ్యక్తి కుక్కల బారి నుంచి ఆ బాలికను కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Girl Attacked By Stray Dogs) ఆ చిన్నారిని రోడ్డుపై ఈడ్చాయి. గమనించిన ఒక వ్యక్తి కుక్కల బారి నుంచి ఆ బాలికను కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగర్ కొత్వాలి ప్రాంతంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. శుక్రవారం ఐదు కుక్కలు బాలికను వెంబడించాయి. దీంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు ఆ చిన్నారి రోడ్డుపై పరుగులుతీసింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. కింద పడిన ఆ బాలికను కుక్కలు ఈడ్చాయి.
కాగా, బాలిక అరుపులు విన్న ఒక వ్యక్తి వెంటనే స్పందించాడు. పరుగున ఆ చిన్నారి వద్దకు వచ్చాడు. కుక్కలను అక్కడి నుంచి తరిమాడు. వాటి బారి నుంచి బాలికను కాపాడాడు. ఆ చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని ఆమె తల్లికి అప్పగించాడు. ఇంతలో కొందరు స్థానికులు అక్కడకు వచ్చారు. కుక్కల దాడిలో గాయపడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP का अमरोहा…
सड़को पर "आवारा कुत्ते" यमदूत बनकर घूम रहे है.. अमरोहा मे इन कुत्तो ने 4 साल के मासूम बच्चे को अपना निवाला बना लिया। बच्चे की हालत गंभीर है.. दिल्ली रैफर किया गया है। #UttarPradesh pic.twitter.com/AGHcBCsqTF
— TRUE STORY (@TrueStoryUP) March 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amroha
- attacked
- Girl
- Stray dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

