Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయం : గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad | రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నారు.
Ghulam Nabi Azad | న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్దదెబ్బ అని ఆజాద్ తెలిపారు. భవిష్యత్‌లో మరికొంత మంది కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఆజాద్ స్పష్టం చేశారు.
అయితే అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని తెలిపారు. వారి తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. తన లెజిస్లేటివ్ కేరీర్ మహారాష్ట్రతోనే ప్రారంభమైందన్నారు. అక్కడ్నుంచే తాను లోక్‌సభకు ఎన్నికయ్యానని గుర్తు చేశారు. రాజ్యసభకు కూడా మహారాష్ట్ర నుంచే వెళ్లాను అని తెలిపారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర మాత్రమే. యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశాయన్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పార్టీ అంతం కాబోతుందని, అది దురదృష్టకరమని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

