Geoportal Bhuvan | గూగుల్ కంటే 10 రెట్లు అధిక సమాచారం.. భువన్ టూల్‌తో ఇస్రో అద్భుతాలు
సమాచార వ్యాప్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో ఇస్రో తన జియోపోర్టల్ ‘భువన్' ద్వారా అద్భుత పురోగతిని సాధిస్తున్నది. సామాజిక అవసరాల కోసం రూపొందించిన ఈ టూల్.. ప్రపంచ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కంటే 10 రెట్లు అధిక వివరాలతో కూడిన సమాచారాన్ని వినియోగదారులకు అందజేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు.
Geoportal Bhuvan | న్యూఢిల్లీ: సమాచార వ్యాప్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో ఇస్రో తన జియోపోర్టల్ ‘భువన్’ ద్వారా అద్భుత పురోగతిని సాధిస్తున్నది. సామాజిక అవసరాల కోసం రూపొందించిన ఈ టూల్.. ప్రపంచ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కంటే 10 రెట్లు అధిక వివరాలతో కూడిన సమాచారాన్ని వినియోగదారులకు అందజేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ లాంటి పలు రంగాలకు ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారాన్ని ‘భువన్’ అందజేస్తున్నదని తెలిపారు.
సమాచార లభ్యతను, వినియోగాన్ని పెంచేందుకు ఈ టూల్తోపాటు భువన్-పంచాయత్, ఎన్డీఈఎం (నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్) అనే మరో రెండు కొత్త టూల్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. మెరుగైన డాటా సెట్లు, అనలిటికల్ టూల్స్‌ను సరఫరా చేయడం ద్వారా స్థానిక పాలనా వ్యవస్థల సాధికారతకు తోడ్పాటునందించాలన్న లక్ష్యంతో భువన్-పంచాయత్ టూల్‌ను రూపొందించామని, సవివరమైన జియోస్పేషియల్ డాటా ఆధారంగా గ్రామ పంచాయతీలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ టూల్ ఉపకరిస్తుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

