జెన్జీ నిరసనలతో ఒత్తిడిలో మోదీ సర్కార్!
వారిని అడ్డుకోవడానికి 10,000 మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించినప్పటికీ గత వారం దేశంలోని యువ నిరసనకారులు బారికేడ్లను దాటి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులతో ఘర్షణ పడ్డారు.
- రానున్న రోజుల్లో యువత నుంచి మరింత అసమ్మతి
- ఏసీఎల్ఈడీ ప్రాజెక్ట్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : వారిని అడ్డుకోవడానికి 10,000 మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించినప్పటికీ గత వారం దేశంలోని యువ నిరసనకారులు బారికేడ్లను దాటి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులతో ఘర్షణ పడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అసమ్మతి పెరుగుతుండటం, జెన్జీ(యువత) వీధుల్లోకి పోటెత్తుతుండటంతో ఈ ఏడాది దేశంలో వీధి నిరసనలు గత దశాబ్దంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్వతంత్ర సంస్థ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డాటా(ఏసీఎల్ఈడీ) ప్రాజెక్ట్ పేర్కొంది. యువత చేపట్టిన నిరసనలు, ప్రతిపక్షానికి పెరుగుతున్న మద్దతు ఇవి 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశంలోని 100 కోట్ల మంది ఓటర్లలో 30 ఏండ్ల లోపు వయస్సు గలవారు దాదాపు నాలుగో వంతు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ప్రస్తుతం స్థిరంగానే ఉంది. తదుపరి సాధారణ ఎన్నికలు 2029 వరకు జరిగే అవసరం లేదు. దేశం అకస్మాత్తుగా తన గళాన్ని కనుగొన్నది అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ అన్నారు. ఇది మోదీ పాలన అంతానికి ఆరంభమని నేను అనను. కానీ ఇది కచ్చితంగా పతనానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్పై రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో నిరసనలు కేంద్రీకృతమయ్యాయి.
భయపడని యువత
మోదీకి బలమైన నాయకుడనే ముద్ర ఉంది. అంతేగాకుండా ఆయన ప్రభుత్వం గతంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వర్గాలపై కఠినంగా వ్యవహరించింది. దీనికి వీధుల్లో ఉన్న యువత ఏమాత్రం చలించడం లేదు. మోదీ శకంలో దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించిన మొట్టమొదటి యువజన ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావంతో ఈ నిరసనలు ఊపందుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

