Gautam Adani: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. నెల రోజుల్లో అదానీ ఎంత సంపద కోల్పోయారంటే!
Gautam Adani: అదానీ ఆస్తులు ఆవిరయ్యాయి. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ఆయన సంపద పడిపోయింది. ఒక్క నెలలోనే దాదాపు 71 బిలియన్ల డాలర్లు ఆయన కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని తెలిపింది.
హైదరాబాద్: వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)సంపద ఆవిరైపోయింది. నెల క్రితం 120 బిలియన్ల డాలర్లు ఉన్న ఆయన ఆస్తి విలువ(net worth).. ఇప్పుడు 50 బిలియన్ల డాలర్ల(Billion Dollars) లోపు పడిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసర్చ్(HIndenbur Research) ఇచ్చిన నివేదికతో అదానీ ఆస్తులన్నీ కుదేలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ కేవలం 49.1 బిలియన్ల డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) డేటా ద్వారా తెలుస్తోంది.
హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టుతో అదానీ ఆస్తులు దారుణంగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీలు నష్టాల్ని చవిచూశాయి. దీంతో నెల క్రితం ప్రపంచంలోనే మూడవ సంపన్న వ్యక్తిగా ఉన్న అదానీ.. ఇప్పుడు ఆ జాబితాలో చాలా కిందకు పడిపోయారు. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీలు మార్కెట్లో దాదాపు 120 బిలియన్ల డాలర్లు కోల్పోయినట్లు తెలుస్తోంది.
కేవలం నెలలోనే అదానీ సుమారు 71 బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. టాప్ 500 మంది సంపన్న వ్యక్తుల జాబితాలో.. అతి త్వరగా సంపదను కోల్పోయిన వారిలో అదానీ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా ప్రకారం అదానీ అత్యంత వేగంగా తన సంపదను కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

