Gaurav Gogoi | ఇప్పుడు 230 మందిని సస్పెండ్ చేస్తారా.. బీజేపీపై కాంగ్రెస్ నేత సెటైరికల్ కామెంట్స్
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీపై కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని దెప్పిపొడిచింది. అయితే విపక్ష 'ఇండియా' కూటమికి పెరిగిన బలంతో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుందని చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ (Gaurav Gogoi) మీడియాతో మాట్లాడారు.
Gaurav Gogoi : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీపై కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని దెప్పిపొడిచింది. అయితే విపక్ష ‘ఇండియా’ కూటమికి పెరిగిన బలంతో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుందని చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ (Gaurav Gogoi) మీడియాతో మాట్లాడారు.
మోదీ నాయకత్వ శైలితో ఈ ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లకాలం అధికారంలో ఉంటుందన్న విశ్వాసం లేదని గౌరవ్ అన్నారు. ‘వారు బిల్లుల్ని ఏకపక్షంగా ఆమోదించారు. ఇప్పుడు భయపెట్టలేరు. సస్పెండ్ చేయలేరు. గత సంవత్సరం వారు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈసారి 230 మందిని సస్పెండ్ చేస్తారా..?’ అని గొగోయ్ ప్రశ్నించారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంట్ ప్రజాస్వామ్యం విషయంలో వారి తీరు మారుతుందని అనుకోవడం లేదన్నారు.
‘అయితే ఫుట్‌బాల్ పదజాలంలో చెప్పాలంటే ఇప్పుడు డిఫెండర్స్ సంఖ్య పెరిగింది. మేం బలంగా మారాం. అలాగే కేంద్రం డీమానిటైజేషన్ గురించి ఆర్థికమంత్రికి తెలియదు. ఆర్టికల్ 370 రద్దు గురించి, అగ్నిపథ్ గురించి ఆయన క్యాబినెట్‌కు తెలియదు. తన క్యాబినెట్‌ను పరిగణనలోకి తీసుకోని వ్యక్తి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు. ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలరని నేను అనుకోవడం లేదు’ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

