Gariaband Encounter | గరియాబంద్‌లో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి
Gariaband Encounter | ఛత్తీస్‌గఢ్ గరియాబంద్‌లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Gariaband Encounter | ఛత్తీస్‌గఢ్ గరియాబంద్‌లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని కుల్హాది ఘాట్‌లోని అటవీ ప్రాంతాన్ని వెయ్యి మందికిపైగా భద్రతా బలగాలు అన్ని వైపులా చుట్టుముట్టాయి. అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు అక్కడ దాక్కుట్లు సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఎన్కౌంటర్లో ఓ జవాన్‌ను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను విమానంలో రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పూర్ జోన్ ఐడీ అమ్రేష్ మిశ్రా తెలిపారు.
సంఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ తదితర ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందన్నారు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్హాది ఘాట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోందని.. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందిందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మార్చి 2026 నాటికి దేశం, రాష్ట్రంలో నక్సలైట్స్‌ను అంతం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పం మేరకు భద్రతా బలగాలు ఈ విషయంలో నిరంతరం విజయం సాధిస్తూ లక్ష్యం వైపు వేగంగా కదులుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బలగాలకు ప్రశంసించిన ఆయన.. ధైర్య సాహసాలకు వందనం చేస్తున్నానన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కారులో 2026 నాటికి ఛత్తీస్‌గఢ్ నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్లో తలపై కోటి రివార్డు ఉన్న జైరామ్ అలియాస్ చలపతి ప్రాణాలు కోల్పోయారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. అలాగే, సీనియర్ మావోయిస్టు సైతం మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఇక గరియాబంద్ ఆపరేషన్‌లో గ్రూప్ ఈ30, కోబ్రా 207, సీఆర్పీఎఫ్ 65, 211 బెటాలియన్, ఎస్ఓసీ నువాపాడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి మూడు, ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగానికి చెందిన రెండు, సీఆర్పీఎఫ్కు చెందిన ఐదు బృందాలు పాల్గొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

