Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
Lawrence Bishnoi | బాలీవుడ్ నటుడు (Bollywood Actor) టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. కొన్నేళ్లుగా అతడు జైల్లోనే ఉన్నప్పటికీ బయట అతడి అనుచరులు సాగిస్తున్న నేర కార్యకలాపాలు కలకలం సృష్టిస్తున్నాయి.
Lawrence Bishnoi : బాలీవుడ్ నటుడు (Bollywood Actor) టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. కొన్నేళ్లుగా అతడు జైల్లోనే ఉన్నప్పటికీ బయట అతడి అనుచరులు సాగిస్తున్న నేర కార్యకలాపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో అతడిపై దాడి జరగవచ్చుననే అనుమానంతో అధికారులు అతడిని మరింత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలుగది (Jail Room) కి మార్చినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు. మొన్నటివరకు ‘10-సెల్’ బ్లాక్‌లో ఉన్న అతడిని ఇప్పుడు హైసెక్యూరిటీ ఉండే ‘200 బ్లాక్’ కు మార్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ బ్లాక్‌ను మొత్తం నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 50 మంది ఖైదీల చొప్పున మొత్తం 200 మంది ఉంటారు. ఒక్కో సెల్ 7.5×11 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఖైదీల మధ్య ఎలాంటి సంభాషణ జరగకుండా ఇక్కడ నిరంతర నిఘా పెట్టారు. 2008 బాంబు పేలుళ్ల దోషులు కూడా ఇదే బ్లాక్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌ను కూడా 200 బ్లాక్‌లోని గదికి మార్చారు.
పంజాబ్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ 2010-12 నుంచి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. హత్యలు, దోపిడీ వంటి నేరాల్లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. 2014లో అక్రమాయుధాల కేసులో అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని కొన్ని జైళ్లతోపాటు ఢిల్లీలోని తిహార్ జైలులో అతడిని కొంతకాలం నిర్బంధించారు. అయితే జైల్లో నుంచే అతడు నేర కార్యకలాపాలను సాగించాడు. జైలు ఫోన్ నుంచే దోపిడీ కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ చేయడం, తన నెట్‌వర్క్‌కు ఆడియో, వీడియో సందేశాలు పంపడం లాంటివి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఓసారి కస్టడీలో ఉండగానే అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.
ఆ తర్వాత మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 2023లో అదుపులోకి తీసుకుని సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించింది. అప్పటి నుంచి ఇదే జైల్లో ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా అతడు బయటి వ్యక్తులకు ఫోన్ చేయడం గానీ, నేరుగా సంభాషించిన సందర్భాలు లేవని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. కేవలం న్యాయ బృందంతో మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు. కోర్టు విచారణలకూ వర్చువల్‌గానే హాజరైనట్లు వెల్లడించారు. అయినప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో నేర కార్యకలాపాలు కొనసాగుతుండటం గమనార్హం.
లారెన్స్ స్నేహితుడైన మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా వంటి వారు విదేశాల్లో ఉంటూ ఈ నేరాలకు కుట్రలు చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారి ఆటకట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

