కాంగ్రెస్‌కు గాలి అనిల్‌కుమార్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్టు తెలిపారు
- పని చేసే వారికి పార్టీలో గౌరవం లేదని ఆవేదన
- టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని మనస్తాపం
పటాన్చెరు, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, ఖర్చుకు వెనుకాడకుండా పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కష్టపడ్డ వారిని కాదని.. టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోని వారికి కూడా బీ ఫాం ఇవ్వడం అన్యాయమని చెప్పారు. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం లేదని విమర్శించారు. కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశానని గాలి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. తనతోపాటు పెద్దసంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడుతారని ఆసక్తి రేకెత్తించారు. తన అనుచరులతో చర్చించి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

