న్యూఢిల్లీ, మే 4: పదమూడు వందల కోట్ల ఏండ్ల క్రితం బిగ్ బ్యాంగ్‌తో విశ్వం పుట్టింది. అప్పటి నుంచి విస్తరిస్తూనే ఉన్నది. అయితే, ఈ విస్తరణ క్రమంగా నెమ్మదిస్తున్నదని, 6.5 కోట్ల ఏండ్ల తర్వాత ఇది ఆగిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
10 కోట్ల ఏండ్ల తర్వాత విశ్వం కుంచించుకుపోవడం మొదలౌతుందని పేర్కొన్నారు. కొన్ని వందల కోట్ల ఏండ్ల తర్వాత విశ్వం మళ్లీ బిగ్ బ్యాంగ్ దశకు చేరుకొంటుందని తెలిపారు. ఈ వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సైంటిఫిక్ ప్రొసీడింగ్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.