G20 Summit | ఢిల్లీలో నేడు జీ20 వర్చువల్ సదస్సు.. పాల్గొననున్న రష్యా, డుమ్మా కొట్టనున్న చైనా..!
G20 Summit | ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం వర్చువల్ జీ20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో కూటమిలోని వివిధ దేశాధినేతలు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సదస్సులో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం వర్చువల్ జీ20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో కూటమిలోని వివిధ దేశాధినేతలు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సదస్సులో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఈ వర్చువల్ G20 లీడర్స్ సదస్సు జరుగుతుంది.
వర్చువల్ సమ్మిట్‌లో అనేక ప్రధానాంశాలు చర్చించబడతాయి. 2023లో గ్లోబల్ ఎకానమీ, ఫైనాన్స్, క్లైమేట్ ఎజెండా, డిజిటలైజేషన్ ఇతర అంశాలపై చర్చిస్తారు. ఈ వర్చువల్ జీ20 సమ్మిట్ ప్రధాని అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హై-లెవల్ వీక్, SDG సమ్మిట్ 78వ సెషన్ తర్వాత ప్రపంచ నాయకుల ప్రధాన సమావేశం ఈ G20 వర్చువల్ సదస్సేనని విలేకరుల సమావేశంలో షెర్పా తెలిపారు.
ఈ సదస్సుకు ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్‌తోపాటు మొత్తం G20 సభ్యదేశాల నాయకులు, తొమ్మిది అతిథి దేశాలు, 11 అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా ఆహ్వానించబడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- g20 summit
- India
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

