TVK MLA Ramesh | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన శ్రీరంగం ఎమ్మెల్యే రమేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఎమ్మెల్యేగా ఎన్నికవకముందు ఆయన ఉద్యోగం కోసం పడిన కష్టాలకు సంబంధించిన పాత వాట్సాప్ చాట్స్ మరియు మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం కోసం రమేష్ పడిన కష్టాలతో పాటు పంపిన అభ్యర్థనలు చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రమేష్, ఆటోమొబైల్ రంగంలో పనిచేసినప్పటికీ, మీడియా, కంటెంట్ క్రియేషన్ రంగాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో ఆయన పలువురు మీడియా నిపుణులకు మెసేజ్‌లు చేస్తూ, తన రెజ్యూమేను పంపి “దయచేసి నాకు ఏదైనా అవకాశం ఇప్పించండి” అని కోరిన స్క్రీన్షాట్లు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. యాంకరింగ్, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్‌ను ఆ సందేశాల్లో ఆయన వ్యక్తపరిచారు.
అయితే పృథ్వీ కృష్ణ అనే సోషల్ మీడియా యూజర్ ఈ స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ.. ఒకప్పుడు ఉద్యోగం కోసం తనను సంప్రదించిన రమేష్, నేడు ఎమ్మెల్యేగా ఎదగడం చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. మధ్యతరగతి యువత పడే కష్టాలకు, పట్టుదలకు రమేష్ ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెడితే, ఒక సామాన్యుడు ఇంతటి స్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసిస్తున్నారు. చెంగల్పట్టు జిల్లాకు చెందిన రమేష్, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చురుకైన పాత్ర పోషించి, శ్రీరంగం నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం ఈ జాబ్ సీకర్ టు ఎమ్మెల్యే ప్రయాణం యువతలో కొత్త ఆశలను నింపుతోంది.
One can see many examples in #TVK that prove hard work can truly elevate a person’s life. Four years ago, TVK Ramesh was just an ordinary youngster. At that time, the party TVK itself had not even been formed. He had responded to a job advertisement posted by me on my X page and… pic.twitter.com/nPwQacAB14
— Stephen (@stevereports) May 11, 2026
And he asked me too and he also shared his resume to me …So proud of you brother @RameshOffcl …Sharing the screenshots here if ur okay with it…If not pls let me know il take it down 😊 As said this is to show ur massive improvement ❤️#TVK https://t.co/nTZurzATZ7 pic.twitter.com/ZU71SpM0mf
— Prithvi krishna (@prithvikrish) May 11, 2026