అసహజ శృంగారం..విద్యార్ధినులకు వేధింపులు : సీనియర్లపై ఫ్రెషర్స్ ఫిర్యాదు
ఇండోర్లోమహాత్మ గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) మెడికల్ కాలేజ్‌లో సీనియర్ల ర్యాగింగ్‌పై ఫ్రెషర్లు సంచలన ఆరోపణలు చేశారు.
భోపాల్ : ఇండోర్లోమహాత్మ గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) మెడికల్ కాలేజ్‌లో సీనియర్ల ర్యాగింగ్‌పై ఫ్రెషర్లు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు సీనియర్లు తమను దిండ్లతో శృంగారం చేయాలని ఒత్తిడి చేశారని, విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ఆరోపించారు.
వర్సిటీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో ఈ అరాచకాలు వెలుగుచూశాయి. సీనియర్లు తమను అసహజ శృంగారం సహా అభ్యంతరకర చర్యలకు పాల్పడేలా ఒత్తిడి చేశారని, తోటి విద్యార్ధినుల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని బాధితులు ఫిర్యాదు చేశారు.
యూజీసీ యాంటీ ర్యాగింగ్ యూనిట్ విద్యార్ధుల ఫిర్యాదును ఎంజీఎంఎంసీ డీన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని డీన్‌ను కోరారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంజీఎం మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 నుంచి 10 మంది థర్డ్ ఇయర్ విద్యార్ధులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

