French Students | మారుమూల పాఠశాలలో టాయిలెట్లు నిర్మించిన ఫ్రెంచ్ విద్యార్థులు.. సాయానికి సరిహద్దులు లేవంటూ ప్రశంసలు
French Students | ఉడిపి, ఆగస్టు 15: ఫ్రెంచ్ విద్యార్థులు భారతదేశం పట్ల తమ ఇష్టాన్ని చాటుకున్నారు. రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన వారు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవ్వడమే కాకుండా.. ఇండియా పట్ల మమకారాన్ని చూపించారు.
French Students | ఉడిపి, ఆగస్టు 15: ఫ్రెంచ్ విద్యార్థులు భారతదేశం పట్ల తమ ఇష్టాన్ని చాటుకున్నారు. రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన వారు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవ్వడమే కాకుండా.. ఇండియా పట్ల మమకారాన్ని చూపించారు. భారత్ నుంచి వెళ్లినప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో.. తాము ఉన్న ఊరిలోని పాఠశాలకు అత్యవసరమైన మరుగదొడ్ల సౌకర్యాన్ని నిర్మించి కానుకగా అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం ఉడిపి జిల్లాలోని కన్యాణ గ్రామం కుద్లు తండాకు వచ్చింది. ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పడం, సృజన్మాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లోని రోజూవారీ లైఫ్‌స్టైల్‌తో కలిసిపోయారు. తాజాగా వారి ఇంటర్న్‌షిప్ పూర్తి కావచ్చింది. దీంతో ఈ ఊరికి కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోకూడదని ఆ బృందం భావించింది. ఎప్పటికీ ఆ గ్రామ ప్రజల మనసుల్లో నిలిచిపోవాలని తాపత్రయపడింది. ఈ క్రమంలోనే పాఠశాలకు అత్యవసరమైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించుకుంది. విద్యార్థుల కోసం పూర్తిస్థాయి మరుగుదొడ్ల సౌకర్యాన్ని సొంతంగా నిర్మించి పాఠశాలకు అందజేశారు.
దీనికి సంబంధించిన వీడియోను elkaani పేరుతో ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఫ్రెంచ్ విద్యార్థులు పిల్లలతో ఆడుతూ, పాఠాలు చెబుతూ స్నేహపూర్వకంగా మెలుగుతుండటం కనిపించింది. ఇది చూసి నెటిజన్లు ఫ్రెంచ్ విద్యార్థులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి సేవాభావం, పిల్లల పట్ల చూపిన మమకారం చూసి మురిసిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లోపం వల్ల చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఈ చిన్న కానుక పెద్ద మార్పు తీసుకురావచ్చని స్థానికులు భావిస్తున్నారు. సరిహద్దులు దాటే దయకు ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

