న్యూఢిల్లీ, అక్టోబర్ 10: స్విస్ బ్యాంకులో భారతీయ పౌరులు, సంస్థలకు చెందిన ఖాతాల వివరాలతో కూడిన నాలుగో జాబితాను స్విట్జర్లాండ్ భారత్కు అందజేసింది. అందులో వ్యాపారస్తులతో పాటు కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన వందల ఖాతాల వివరాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. స్విట్జర్లాండ్తో కుదుర్చుకొన్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ ఈ జాబితాను అందిస్తున్నది. తాజాగా 101 దేశాలకు చెందిన 34 లక్షల అకౌంట్ల వివరాలను విడుదల చేసింది.