Doctors Killed: రోడ్డు ప్రమాదంలో నలుగురు డాక్టర్లు మృతి
Doctors Killed: లక్నోలో పెళ్లికి హాజరై వస్తున్న నలుగురు డాక్టర్లు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సైఫాయి మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ఆ డాక్టర్ల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. డాక్టర్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి..ఢివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనం వచ్చి దాన్ని ఢీకొన్నది.
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు డాక్టర్లు(Doctors Killed) మృతిచెందారు. వారితో పాటు ఓ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సైఫాయిలో ఉన్న యూపీ మెడికల్ యూనివర్సిటీ డాక్టర్లు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. అతివేగంతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం అదుపు తప్పి ఢివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత అటుగా వస్తున్న ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొన్నట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. ఎస్యూవీ వాహనం డివైడర్ను ఢీకొని మరో లేన్లోకి వెళ్లింది. అప్పుడు ఆ లేన్లో వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో నలుగురు డాక్టర్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా స్పాట్లోనే చనిపోయాడు. డాక్టర్ల ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న ఓ పీజీ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తిర్వాలోని అంబేద్కర్ మెడికల్ కాలేజీలో అతన్ని చేర్పించారు.
మృతిచెందిన వారిలో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్ర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నర్దేవ్ ఉన్నారు. లక్నోలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

