Road accident | ఐదు ప్రాణాలు తీసిన అతివేగం.. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి
Road accident | అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌తోపాటు అందరూ మైనర్లే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలోని చర్గవాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల తినేతా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌తోపాటు అందరూ మైనర్లే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలోని చర్గవాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల తినేతా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ధర్మేంద్ర ఠాకూర్ అనే 18 ఏళ్ల బాలుడు.. లక్కీ మార్కమ్ (10), అనూప్ బర్కడే (12), రాజ్వీర్ గోండ్ (13), దేవేంద్ర బర్కడే (15), దళ్పత్ గోండ్ (12), వికాస్ ఉయ్కే (10) లను ట్రాక్టర్లో తీసుకుని చేను దగ్గరికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌ను వేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దల్పత్ గోండ్, వికాస్ ఉయ్కే మినమా మిగతా ఐదుగురు మరణించారు.
మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

