ఫార్చునర్‌లో వచ్చి.. పారిశుద్ధ్య పనులు
రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు అత్యంత ఖరీదైన టొయోటా ఫార్చూనర్ కారులో వస్తే ఎలా ఉంటుంది? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిజంగానే ఫార్చూనర్ కారులో వస్తూ..రోజూ రోడ్లు, వీధులు ఊడుస్తున్నాడు.
- ఆర్థికంగా ఎదిగినా.. వృత్తి పట్ల నిబద్ధత
బెంగళూరు : రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు అత్యంత ఖరీదైన టొయోటా ఫార్చూనర్ కారులో వస్తే ఎలా ఉంటుంది? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిజంగానే ఫార్చూనర్ కారులో వస్తూ..రోజూ రోడ్లు, వీధులు ఊడుస్తున్నాడు. బంత్వాల్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు శేషణప్ప ప్రతి రోజూ తన ఫార్చూనర్ కారును స్వయంగా నడుపుకుంటూ బీసీ రోడ్ మార్కెట్‌కు వెళ్తాడు. అక్కడ కారును పార్కింగ్ చేసి, కిందకి దిగి..తన చీపురును అందుకొని రోజువారీ పారిశుధ్య పనులు ప్రారంభిస్తాడు.
తన పనులన్నీ పూర్తిచేసుకున్న తర్వాత అదే వాహనంలో ఇంటికి తిరిగివెళ్తాడు. ఓ మామూలు కార్మికుడు విలాసవంతమైన వాహనంలో రావటం వార్తల్లో నిలిచింది. ఆర్థికంగా బాగా స్థిరపడినప్పటికీ తన వృత్తి పట్ల అతడు కొనసాగిస్తున్న నిబద్ధతను ఇది తెలియజేస్తున్నది. శేషణప్ప తన వృత్తి జీవితాన్ని రోజుకు కేవలం రూ.50 సంపాదనతో మొదలుపెట్టాడట. గత మూడు దశాబ్ధాలుగా అతడు అనేక ఉద్యోగాలు చేస్తూ, క్రమంగా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

