కాల్పుల్లో టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ మృతి
టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ పరమ్‌జీత్ ధన్కర్ ఫరీదాబాద్‌లో తన పొరుగింటి వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన మేనల్లుడి వివాహానికి హాజరయ్యేందుకు రెండు రోజుల క్రితమే సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చారు.
న్యూఢిల్లీ : టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ పరమ్‌జీత్ ధన్కర్ ఫరీదాబాద్‌లో తన పొరుగింటి వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన మేనల్లుడి వివాహానికి హాజరయ్యేందుకు రెండు రోజుల క్రితమే సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చారు.
పరమ్‌జీత్ కుటుంబ సభ్యులకు, వారి పొరుగింట్లో ఉంటున్న మోను శర్మ కుటుంబ సభ్యులకు తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కారు పార్కింగ్ విషయంలో పరమ్‌జీత్, మోను మధ్య ఘర్షణ జరిగింది. మోను తన లైసెన్స్డ్ తుపాకీతో 15 రౌండ్లు కాల్చగా, 9 తూటాలు పరమ్‌జీత్‌కు తగిలాయి. దీంతో ఆయన ప్రాణాలు విడిచారు. కార్ల పార్కింగ్, పెంపుడు కుక్క మూత్ర విసర్జన వంటి సాధారణ విషయాల్లో గొడవ పడేవారని తెలుస్తున్నది. మోనును అరెస్ట్ చేశారు. మోను భార్య, కుమార్తె, కుమారుడు, సోదరుడు నిందితులని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

