ఉచితాలు అనుచితం.. అప్పు తెచ్చి తాయిలాలిస్తున్నారు: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
పోటాపోటీగా తాయిలాలిచ్చే రాజకీయాలు సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఆయన రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. ఉచిత పథకాల సంస్కృతి ఎన్నికల్లో గెలిపించవచ్చునేమో కానీ, దేశాన్ని నిర్మించజాలదని హితవు పలికారు.
- ఇవి ఎన్నికల్లో గెలిపిస్తాయేమో, కానీ దేశాన్ని మాత్రం నిర్మించలేవు
- గ్యారెంటీలపై ఎన్నికైన ప్రభుత్వాలు, హామీలు అమలుచేయలేక అవస్థలు
న్యూఢిల్లీ: పోటాపోటీగా తాయిలాలిచ్చే రాజకీయాలు సరికాదని ఆర్బీఐ (RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు (Duvvuri Subbarao) హెచ్చరించారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఆయన రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. ఉచిత పథకాల (Freebies) సంస్కృతి ఎన్నికల్లో గెలిపించవచ్చునేమో కానీ, దేశాన్ని నిర్మించజాలదని హితవు పలికారు. బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావిస్తూ, ఇది పోటాపోటీ ప్రజాకర్షక రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. అవాస్తవిక నగదు హామీలతో ఒక పార్టీని మించిపోయేందుకు మరొక పార్టీ పరుగులు పెట్టిందన్నారు. రాజకీయ పార్టీలు నగదును పంపిణీ చేసినపుడు, భారీ ఉచిత పథకాలను ప్రకటించినపుడు, ఆ పథకాల్లో ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ చిట్ట చివరి క్షణంలో చేసిన నగదు బదిలీ వల్ల కొన్ని ఓట్లను పొంది ఉండవచ్చునని, విస్తృత స్థాయిలో పోటీపడుతూ ఇచ్చే హామీల్లో ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గిస్తుందని అన్నారు. హామీలు నమ్మశక్యంగా లేనపుడు ప్రజలు వాటిని నమ్మడం మానేస్తారని చెప్పారు.
రేవ్డీకి వ్యతిరేకమన్న వారే ఇప్పుడు ఉచిత హామీలు..
‘గ్యారెంటీ’లపై ఎన్నికైన ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని అమలు చేయడానికి ఇబ్బందులు పడుతుండటం తీవ్రమైన సమస్య అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకప్పుడు రేవిడి కల్చర్‌ను ఎండగట్టారని, ఇప్పుడు వాటి వల్ల ఎన్నికల్లో జరిగే లాభాలను చూసిన తర్వాత ఆయన కూడా వాటిని ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది పార్టీ పక్షపాతం వల్ల జరిగే వైఫల్యం కాదని, రాజకీయ వ్యవస్థలోనే పాతుకుపోయిన సమస్య అని తెలిపారు. ఉచితాల పరుగు పందెంలో వెనుకబడిపోవాలని ఏ రాజకీయ పార్టీ కోరుకోదన్నారు. ప్రభుత్వానికి గల జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసిన బాధ్యతకు ఎన్నికల ప్రోత్సాహకాలు అనుగుణంగా లేనపుడు, వివేకం దెబ్బతింటుందని వివరించారు.
రాజకీయ వైఫల్యమే
ప్రతి ఉచిత పథకం రాజకీయ వైఫల్యాన్ని అంగీకరించేదేనని సుబ్బారావు వ్యాఖ్యానించారు. ఉచిత పథకాల హామీలు ఇవ్వడమంటే, “నీకు గౌరవప్రదమైన జీవనోపాధిని, క్రమబద్ధమైన ఆదాయాన్ని ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి దీనితో సర్దుకుపో” అని రాజకీయ నేతలు చెప్తున్నట్లేనని తెలిపారు. ఉద్యోగాలను ఎలా సృష్టించాలి? ఉత్పాదకతను ఎలా పెంచాలి? మానవ మూలధనాన్ని ఎలా పెంచాలి? అనే విషయాలను భారత దేశం చర్చించడం లేదని, దానికి బదులుగా, రూ.30,000 హామీ ఇచ్చినపుడు రూ.10,000 సరిపోతుందా? అనే అంశంపైకి చర్చ మళ్లిందన్నారు.
అప్పు తెచ్చి మరీ..
అగ్నికి తోడవుతున్న ఆజ్యం ఏమిటంటే, ఈ ఉచిత పథకాలను అప్పు తెచ్చిన సొమ్ముతో ఇస్తుండటమని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి వినియోగ భారాన్ని భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై మోపుతున్నారన్నారు. ప్రభుత్వ ఆర్థిక దుస్సాహసాన్ని కట్టడి చేయవలసిన ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలిపారు. కాపాడటానికి శాసన వ్యవస్థ, మరీ ముఖ్యంగా, ప్రతిపక్షాలు ముందు వరుసలో ఉండవలసిందని, కానీ ఉచిత పథకాలను విమర్శించే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయలేకపోతున్నదని, పేదలకు వ్యతిరేకి అనే భావన కలుగుతుందని పార్టీలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆడిట్ రిపోర్ట్‌ల జాప్యంతో సతమతమవుతున్నదన్నారు. మితిమీరిన అప్పుల వల్ల నష్టం గురించి మార్కెట్లు పట్టించుకోవడం లేదని, రాష్ర్టాలు డిఫాల్ట్ అయ్యే అవకాశాన్ని కేంద్రం ఇవ్వదని మదుపరులు భావించడమే దీనికి కారణమని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

