మొహాలి: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్(95) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనను కుటుంబసభ్యులు మొహాలీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్చారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాదల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.
ప్రకాశ్ సింగ్ బాదల్ 1947లో సర్పంచ్‌గా రాజకీయాల్లో ప్రస్థానాన్ని మొదలుపెట్టి నాలుగు పర్యాయాలు పంజాబ్ సీఎంగా పని చేశారు. దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు.